విధేయతకు దీవెనలు
1 మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటూ, నేను ఈ రోజు మీకిచ్చే ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త దేశాల కంటే పైగా మిమ్మల్ని హెచ్చిస్తారు. 2 మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడితే, ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి, మిమ్మల్ని వెంబడిస్తాయి:
12 కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు.