Pular para o conteúdo
Publicidade

ద్వితీయో 3:23-28

OTSA Telugu Contemporary Version

23 ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను: 24 "ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు? 25 నేను వెళ్లి యొర్దాను అవతల ఉన్న మంచి దేశాన్ని, మంచి కొండ ప్రాంతాన్ని, లెబానోనును చూడనివ్వండి."

26 అయితే మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి, నా మొర వినలేదు. యెహోవా నాతో అన్నారు, "ఇక చాలు, ఈ విషయమై నాతో ఇక మాట్లాడవద్దు. 27 నీవు పిస్గా కొండ శిఖరం పైకెక్కి అక్కడినుండి పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపులకు చూడు. నీవు యొర్దాను నది దాటవు కాబట్టి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు. 28 అయితే యెహోషువను నియమించి, అతన్ని ప్రోత్సాహించి బలపరచు, ఎందుకంటే అతడు ఈ ప్రజలను నది దాటిస్తాడు, నీవు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకునేలా చేస్తాడు."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 ఆ రోజుల్లో నేను "యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు. 24 ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు? 25 నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు" అని యెహోవాను బతిమాలుకున్నాను.

    26 యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. "చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. 27 నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు. 28 నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.