Pular para o conteúdo
Publicidade

ద్వితీయో 32:16-18

OTSA Telugu Contemporary Version

16 వారు ఇతర దేవుళ్ళ వల్ల ఆయనకు రోషం పుట్టించారు,

వారి అసహ్యకరమైన విగ్రహాలతో ఆయనకు కోపం కలిగించారు.

17 దేవుడు కాని దయ్యాలకు వారు బలులర్పించారు

తమకు తెలియని దేవుళ్ళకు,

క్రొత్తగా వచ్చిన దేవుళ్ళకు,

మీ పూర్వికులు లెక్కచెయ్యని దేవుళ్ళకు మ్రొక్కారు.

18 మీకు తండ్రిగా ఉన్న ఆశ్రయ దుర్గాన్ని మీరు విడిచిపెట్టారు;

మీకు జన్మనిచ్చిన దేవుని మీరు మరచిపోయారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు.

    అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.

    17 వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు.

    తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ,

    మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.

    18 నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు,

    నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.