Pular para o conteúdo
Publicidade

ఎఫెసీ పత్రిక 2:11-13

OTSA Telugu Contemporary Version

క్రీస్తు ద్వారా యూదులు, యూదేతరులు సమాధానపరచబడుట

11 కాబట్టి, పుట్టుకతోనే యూదేతరులైన మీరు, తమను తాము "సున్నతి" అంటే మానవ హస్తాలతో శరీరంలో చేయబడేది అని పిలుచుకునే వారి చేత "సున్నతి చేయబడనివారు" అని గతంలో ఎలా పిలువబడ్డారో జ్ఞాపకం చేసుకోండి. 12 ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు. 13 ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    11 కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. "శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు" మిమ్మల్ని "సున్నతి లేనివారు" అని పిలిచేవారు. 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు. 13 అయితే పూర్వం దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గరయ్యారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.