Pular para o conteúdo
Publicidade

ఎఫెసీ పత్రిక 4:15,22-26,29,32

15 ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము.

22 మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి, 23 మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; 24 నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.

25 కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము. 26 "మీ కోపంలో పాపం చేయకండి"4:26 కీర్తన 4:4: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి.

29 మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి. 32 క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిపట్ల ఒకరు దయా, కనికరం కలిగి ఉండండి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.