Pular para o conteúdo
Publicidade

ఎఫెసీ పత్రిక 4:26,27,31,32

OTSA Telugu Contemporary Version

26 "మీ కోపంలో పాపం చేయకండి"4:26 కీర్తన 4:4: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. 27 అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి.

31 అదే విధంగా, ద్వేషమంతటిని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను, ప్రతి విధమైన దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. 32 క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిపట్ల ఒకరు దయా, కనికరం కలిగి ఉండండి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    26 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి.

    31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.