3 ఇశ్రాయేలీయుల సమాజమంతటికి చెప్పండి, ఈ నెల పదవ రోజున ప్రతి మనిషి తన కుటుంబానికి ఒక గొర్రెను తీసుకోవాలి, ప్రతి ఇంటికి ఒకటి. 5 మీరు ఎంచుకున్న జంతువులు తప్పనిసరిగా ఏ లోపం లేని సంవత్సరపు మగవై ఉండాలి; వాటిని గొర్రెలలో నుండి కాని మేకలలో నుండి కాని తీసుకోవాలి. 6 ఇశ్రాయేలు సమాజంలోని సభ్యులందరు సంధ్య సమయంలో వాటిని వధించవలసిన నెల పద్నాలుగవ రోజు వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. 7 అప్పుడు వారు దాని రక్తంలో కొంచెం తీసుకుని తాము గొర్రెపిల్లలను తినే వారి ఇళ్ళ ద్వారబంధాలకు రెండు పలకల మీద పూయాలి.
13 మీరున్న ఇళ్ళ మీద ఉన్న రక్తం మీకు గుర్తుగా ఉంటుంది, నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు, మిమ్మల్ని దాటి వెళ్తాను. నేను ఈజిప్టును మొత్తినప్పుడు ఏ నాశనకరమైన తెగులు మిమ్మల్ని తాకదు.
22 హిస్సోపు కొమ్మను తీసుకుని, పళ్ళెంలో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికి, రెండు నిలువు కమ్మీలకు పూయాలి. ఉదయం వరకు మీలో ఎవరూ మీ ఇంటి ద్వారం నుండి బయటకు రాకూడదు.
46 "దీనిని ఒక ఇంటి లోపలే తినాలి; దాని మాంసంలో దేన్ని ఇంటి బయటకు తీసుకెళ్లకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు.