Pular para o conteúdo
Publicidade

నిర్గమ 12:5,8,13,14,46

OTSA Telugu Contemporary Version

5 మీరు ఎంచుకున్న జంతువులు తప్పనిసరిగా ఏ లోపం లేని సంవత్సరపు మగవై ఉండాలి; వాటిని గొర్రెలలో నుండి కాని మేకలలో నుండి కాని తీసుకోవాలి. 8 ఆ రాత్రే వారు అగ్నిలో కాల్చబడిన ఆ మాంసాన్ని చేదు మూలికలతో, పులియని రొట్టెలతో తినాలి.

13 మీరున్న ఇళ్ళ మీద ఉన్న రక్తం మీకు గుర్తుగా ఉంటుంది, నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు, మిమ్మల్ని దాటి వెళ్తాను. నేను ఈజిప్టును మొత్తినప్పుడు ఏ నాశనకరమైన తెగులు మిమ్మల్ని తాకదు.

14 "ఈ రోజును మీరు స్మారకోత్సవం జరుపుకోవాలి; ఎందుకంటే రాబోయే తరాలకు దీనిని ఒక నిత్య కట్టుబాటుగా మీరు యెహోవాకు పండుగగా జరుపుకోవాలి.

46 "దీనిని ఒక ఇంటి లోపలే తినాలి; దాని మాంసంలో దేన్ని ఇంటి బయటకు తీసుకెళ్లకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి.

    8 ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి.

    13 మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు.

    14 కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.

    46 ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.