2 ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగింది. 3 ఇశ్రాయేలీయులు వారితో, "మేము ఈజిప్టు దేశంలో మాంసం వండుకున్న కుండల చుట్టూ కూర్చుని మేము కోరుకున్న ఆహారమంతా తృప్తిగా తిన్నప్పుడే యెహోవా చేతిలో చనిపోయినా బాగుండేది. అయితే ఈ సమాజమంతా ఆకలితో చనిపోవాలని మీరు మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకువచ్చారు" అని అన్నారు.
15 ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, "ఇదేమిటి?" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
మోషే వారితో, "ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము.
19 అప్పుడు మోషే వారితో, "దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకోకూడదు" అని చెప్పాడు.
20 అయితే వారిలో కొందరు మోషే మాట వినిపించుకోకుండా దానిలో కొంచెం ఉదయం వరకు మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టింది. కాబట్టి మోషే వారిమీద కోపడ్డాడు.
22 ఆరవరోజు, ఒక్కొక్కరికి రెండేసి ఓమెర్ల16:22 అంటే సుమారు 2.8 కి. గ్రా. లు చొప్పున రెట్టింపు పోగుచేసుకున్నారు, సమాజ నాయకులు వచ్చి మోషేకు దానిని తెలిపారు. 23 అతడు వారితో, "యెహోవా ఆజ్ఞ ఇదే, రేపు సబ్బాతు దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన సబ్బాతు విశ్రాంతి దినము. కాబట్టి మీరు కాల్చుకోవాలనుకున్నది కాల్చుకోండి, వండుకోవాలనుకున్నది వండుకోండి. మిగిలింది ఉదయం వరకు ఉంచుకోండి" అని చెప్పాడు.
24 మోషే ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఉదయం వరకు దానిని ఉంచారు కాని అది కంపుకొట్టలేదు పురుగులు పట్టలేదు.