Pular para o conteúdo
Publicidade

నిర్గమ 2:1-4,7-9

మోషే జననం

1 ఆ రోజుల్లో లేవీ గోత్రపు పురుషుడు లేవీ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, 2 ఆమె గర్భవతియై ఒక కుమారుడిని కన్నది. అతడు చక్కగా ఉండడం చూసి, ఆమె వానిని మూడు నెలలు దాచిపెట్టింది. 3 కాని ఆమె వానిని ఇక దాచలేకపోయినప్పుడు, వాని కోసం ఒక జమ్ము బుట్ట తీసుకుని దానికి జిగటమన్ను తారు పూసింది. ఆ పిల్లవాన్ని అందులో పడుకోబెట్టి దానిని నైలు నది ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచింది. 4 అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది.

7 అప్పుడు ఆ పిల్లవాని అక్క ఫరో కుమార్తెతో, "ఈ పిల్లవాన్ని నీకోసం పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒకరిని పిలుచుకొని రమ్మంటారా?" అని అడిగింది.

8 అందుకు ఆమె, "సరే, వెళ్లు" అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది. 9 ఫరో కుమార్తె ఆమెతో, "నీవు ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను" అని చెప్పింది. ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచింది.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.