18 ప్రజలు ఆ ఉరుములు మెరుపులు చూసి బూరధ్వని విని పర్వతం నుండి వస్తున్న పొగను చూసి, వారు భయంతో వణికారు. వారు దూరంగా నిలబడి 19 మోషేతో, "నీవు మాతో మాట్లాడు మేము వింటాము. మాతో దేవుడు నేరుగా మాట్లాడవద్దు లేదా మేము చనిపోతాం" అన్నారు.
20 అందుకు మోషే ప్రజలతో, "భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు వచ్చారు, తద్వార మీరు పాపం చేయకుండా దేవుని భయం మీలో ఉంటుంది" అని చెప్పాడు.
21 దేవుడున్న ఆ కటికచీకటిని మోషే సమీపిస్తూ ఉండగా ప్రజలు దూరంగా ఉన్నారు.
విగ్రహాలు, బలిపీఠాలు
22 తర్వాత యెహోవా మోషేతో, "ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను పరలోకం నుండి మీతో మాట్లాడడం మీరే చూశారు. 23 మీరు నాతో పాటు దేన్ని దేవుళ్ళుగా చేసుకోకూడదు; మీ కోసం వెండి దేవుళ్ళను గాని బంగారు దేవుళ్ళను గాని మీరు చేసుకోకూడదు.
24 " ‘నా కోసం మట్టితో బలిపీఠం తయారుచేసి దానిపై మీ దహనబలులను, సమాధానబలులను, మీ గొర్రెలను పశువులను అర్పించాలి. నేను ఎక్కడ నా పేరును ఘనపరచబడేలా చేసిన, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 25 ఒకవేళ మీరు నా కోసం రాళ్లతో బలిపీఠం కడితే, దానిని చెక్కిన రాళ్లతో కట్టవద్దు, ఎందుకంటే వాటిపైన మీరు పనిముట్టు ఉపయోగిస్తే అది అపవిత్రం అవుతుంది. 26 నా బలిపీఠం దగ్గరకు మెట్లు ఎక్కి వెళ్లవద్దు, ఎందుకంటే మీ లోపలి అవయవాలు కనబడతాయి.’