Pular para o conteúdo
Publicidade

నిర్గమ 30:17-21

OTSA Telugu Contemporary Version

కడగడం కోసం గంగాళం

17 యెహోవా మోషేతో ఇలా అన్నారు: 18 "కడుక్కోడానికి నీవు ఒక ఇత్తడి గంగాళాన్ని, దానికి ఇత్తడి పీటని చేసి సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో పెట్టి దానిలో నీళ్లు పోయాలి. 19 దానిలో ఉన్న నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి. 20 వారు సమావేశ గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, వారు నీళ్లతో కడుక్కోవాలి, తద్వారా వారు చావరు. అలాగే, వారు యెహోవాకు హోమబలి అర్పించి సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించినప్పుడు, 21 తాము చనిపోకుండా ఉండడానికి వారు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి. ఇది అహరోనుకు అతని కుమారులకు తర్వాతి తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    17 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. "నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి. 18 సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి. 19 ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.

    20 వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.

    21 వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.