Pular para o conteúdo
Publicidade

యెహెజ్కేలు 2

యెహెజ్కేలుకు ప్రవక్తగా పిలుపు

1 ఆయన నాతో, "మనుష్యకుమారుడా,2:1 హెబ్రీలో బెన్ ఆదాము అంటే మానవుడు. క్రొత్త నిబంధనలో "మనుష్యకుమారుడు" తో సహ అనుబంధం కారణంగా మనుష్యకుమారుడా అనే పద బంధం ఇక్కడ యెహెజ్కేలు అంతటా సంబోధించబడింది లేచి నీ కాళ్లమీద నిలబడు. నీతో నేను మాట్లాడతాను" అన్నారు. 2 ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆత్మ నా మీదికి వచ్చి నా పాదాల మీద నన్ను నిలబెట్టినప్పుడు ఆయన నాతో మాట్లాడడం నేను విన్నాను.

3 ఆయన నాతో, "మనుష్యకుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; వారు వారి పూర్వికులు ఈ రోజు వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 4 మొండివారును కఠిన హృదయులునైన ప్రజల దగ్గరకు నేను నిన్ను పంపుతున్నాను. ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదేనని వారితో చెప్పు.’ 5 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునేలా వారికి చెప్పు. 6 మనుష్యకుమారుడా, వారికి, వారి మాటలకు భయపడకు. నీ చుట్టూ ముండ్లపొదలు ముళ్ళు ఉన్నా, తేళ్ల మధ్య నివసిస్తున్నా నీవు భయపడకు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వారు అన్న వాటికి వారి చూపులకు నీవేమి భయపడకు. 7 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి. 8 మనుష్యకుమారుడా, వారు తిరుగుబాటు చేసినట్లే నీవు చేయకు. నా మాట విను. నోరు తెరిచి నేను ఇచ్చేది తిను."

9 నేను చూస్తుండగా గ్రంథపుచుట్టను పట్టుకుని ఒక చేయి నాకు దగ్గరగా రావడం కనపడింది, 10 ఆయన దానిని నా ముందు తెరిచారు. దానికి రెండు వైపులా విలాపం, దుఃఖం శ్రమ అనే మాటలు వ్రాసి ఉన్నాయి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.