Pular para o conteúdo
Publicidade

యెహెజ్కేలు 9:4-6

OTSA Telugu Contemporary Version

4 యెహోవా అతనితో, "నీవు వెళ్లి యెరూషలేము పట్టణమంతా తిరిగి అక్కడ జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించి విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టు" అన్నారు.

5 నేను వింటుండగా ఆయన మిగిలిన వారితో, "మీరు అతని వెంట పట్టణంలోనికి వెళ్లి దయా కనికరం లేకుండా అందరిని చంపండి. 6 ఎవరినీ విడిచిపెట్టకండి. వృద్ధులను, యువకులను, స్త్రీలను, తల్లులను పిల్లలను అందరిని చంపండి కాని ఆ గుర్తు ఉన్నవారిని మాత్రం ముట్టుకోవద్దు. నా పరిశుద్ధాలయం నుండి మొదలుపెట్టండి" అన్నారు. వెంటనే వారు మందిరం ముందున్న వృద్ధులతో మొదలుపెట్టారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 యెహోవా అతనితో ఇలా చెప్పాడు. "యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అక్కడ తిరుగు. పట్టణంలో జరుగుతున్న అసహ్యమైన పనులను గూర్చి మూలుగుతూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వాళ్ళ నుదుటిపై ఒక గుర్తు పెట్టు."

    5 అప్పుడు నేను వింటూ ఉండగా ఆయన మిగిలిన వాళ్ళకి ఇలా అజ్ఞాపించాడు. "మీరు అతని వెనకే పట్టణంలో సంచరించండి. హతమార్చండి! ఎలాంటి కనికరమూ లేకుండా అందరినీ చంపండి. 6 ముసలి వాళ్ళైనా, యువకులైనా, కన్యలైనా, చిన్న పిల్లలైనా, స్త్రీలైనా అందరినీ చంపండి! కానీ నుదుటిపై గుర్తు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. నా మందిరం దగ్గరనుండే ప్రారంభం చేయండి." కాబట్టి వాళ్ళు మందిరం ఎదుట ఉన్న పెద్దవాళ్ళతో మొదలు పెట్టారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.