Pular para o conteúdo
Publicidade

ఫిలిప్పీ పత్రిక 3:4-6

OTSA Telugu Contemporary Version

4 కావాలంటే నేను శరీరంపై అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు.

ఎవరైనా శరీరంపై నమ్మకం ఉంచడానికి తమ దగ్గర కారణాలు ఉన్నాయని అనుకుంటే, వారికంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. 5 నేను ఎనిమిదవ రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశానికి చెందినవాన్ని, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను; ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడను. 6 అత్యాసక్తితో సంఘాన్ని హింసించాను; ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని నీతి విషయంలో నిరపరాధిని.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను. 5 ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీయుల్లో హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి. 6 క్రైస్తవ సంఘాన్ని తీవ్రంగా హింసించాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో నిందారహితుడిని.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses