27 అయితే వ్రాయబడిన ప్రకారం,
"గొడ్రాలా, పిల్లలు కననిదానా, ఆనందించు;
ప్రసవవేదన పడనిదానా,
ఆనందంతో కేకలు వేయి;
ఎందుకంటే, భర్త ఉన్నదాని పిల్లలకంటే
విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువమంది ఉన్నారు."4:27 యెషయా 54:1
28 అయితే సహోదరీ సహోదరులారా, మీరు ఇస్సాకులా వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలు. 29 ఆ సమయంలో శరీరానుసారమైన కుమారుడు ఆత్మానుసారమైన కుమారుని ఎలా హింసించాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది.