Pular para o conteúdo
Publicidade

ఆది 12:1-4

OTSA Telugu Contemporary Version

అబ్రాముకు పిలుపు

1 యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, "నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.

2 "నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను,

నిన్ను ఆశీర్వదిస్తాను;

నీ పేరును గొప్పగా చేస్తాను,

నీవు దీవెనగా ఉంటావు.

3 నిన్ను దీవించే వారిని దీవిస్తాను,

శపించే వారిని శపిస్తాను;

నిన్ను బట్టి భూమి మీద ఉన్న

సర్వ జనాంగాలు దీవించబడతారు."12:3 లేదా భూమి దీవించడానికి నీ పేరును వాడుకుంటారు (48:20 చూడండి)

4 యెహోవా చెప్పినట్టే అబ్రాము బయలుదేరాడు; లోతు అతనితో వెళ్లాడు. హారాను నుండి ప్రయాణమైనప్పుడు అబ్రాము వయస్సు డెబ్బై అయిదు సంవత్సరాలు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. "నీ దేశం నుంచి, నీ బంధువుల12:1 లేక నీవు పుట్టిన స్థలం. దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది."

    4 యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.