Pular para o conteúdo
Publicidade

ఆది 18:23-26,32,33

OTSA Telugu Contemporary Version

23 అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, "దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా? 24 ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది నీతిమంతులుంటే ఎలా? ఆ యాభైమంది కోసమన్నా ఆ పట్టణాన్ని కాపాడకుండా18:24 లేదా క్షమించుట; 26 వచనంలో కూడా నిజంగా దానిని నాశనం చేస్తారా? 25 అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?" అని అన్నాడు.

26 యెహోవా జవాబిస్తూ, "సొదొమలో యాభైమంది నీతిమంతులను నేను కనుగొంటే, వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాపాడతాను" అని అన్నారు.

32 అప్పుడతడు, "ప్రభువా, కోప్పడకండి, నేను ఇంకొక్కసారి మాట్లాడతాను. ఒకవేళ అక్కడ పదిమందే ఉంటే?" అని అడిగాడు.

ఆయన, "ఆ పదిమంది కోసం దానిని నాశనం చేయను" అని జవాబిచ్చారు.

33 యెహోవా అబ్రాహాముతో సంభాషణ ముగించిన తర్వాత, ఆయన వెళ్లిపోయారు, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. "దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?

    24 ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25 నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?" 26 దానికి యెహోవా "సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను" అన్నాడు.

    32 చివరిగా అతడు "ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో" అన్నాడు. అప్పుడు ప్రభువు "పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను" అన్నాడు. 33 అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.