ఇస్సాకు పుట్టుక
1 యెహోవా తాను చెప్పినట్టే శారా పట్ల కృప చూపించారు, శారాకు వాగ్దానం చేసినట్టే యెహోవా చేశారు. 2 సరిగ్గా దేవుడు వాగ్దానం చేసిన నిర్ణీత కాలంలో శారా గర్భవతియై, వృద్ధాప్యంలో ఉన్న అబ్రాహాముకు కుమారున్ని కన్నది.
6 శారా, "నాకు దేవుడు నవ్వు తెప్పించారు, ఇది వినే ప్రతివారు నాతో నవ్వుతారు, 7 శారా పిల్లలకు పాలిస్తుందని అబ్రాహాముతో ఎవరు అంటారు? అయినా నా భర్తకు వృద్ధాప్యంలో కుమారున్ని కన్నాను" అని అన్నది.