Pular para o conteúdo
Publicidade

ఆది 22:6-8

OTSA Telugu Contemporary Version

6 అబ్రాహాము దహనబలి కోసం కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, అతడు నిప్పును కత్తిని పట్టుకుని వెళ్లాడు. వారిద్దరు కలసి నడిచి వెళ్తున్నప్పుడు, 7 ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, "తండ్రీ" అని పిలిచాడు.

"నా కుమారుడా, ఏంటి?" అని అబ్రాహాము జవాబిచ్చాడు.

ఇస్సాకు, "నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?" అని అడిగాడు.

8 "నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు" అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు.

    7 ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును "నాన్నా" అని పిలిచాడు. దానికి అబ్రాహాము "ఏం నాయనా" అన్నాడు. అప్పుడతడు "చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?" అని అడిగాడు. 8 దానికి అబ్రాహాము "కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.