10 యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు. 11 తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు.
18 యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, "నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను" అన్నాడు.
20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు, అయితే తనకు రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి అతనికి ఆ ఏడు సంవత్సరాలు కొద్దిరోజులే అనిపించింది.
25 తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, "నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?" అని అడిగాడు.
27 లేయాతో వైవాహిక వారం గడువు ముగించు. తర్వాత మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే రాహేలును కూడా నీకిస్తాను" అని అన్నాడు.
30 యాకోబు రాహేలుతో కూడా పడుకున్నాడు, అతడు లేయాకంటే రాహేలును ఎక్కువ ప్రేమించాడు కాబట్టి అతడు లాబాను కోసం ఇంకా ఏడు సంవత్సరాలు పని చేశాడు.