Pular para o conteúdo
Publicidade

ఆది 3:8-13

OTSA Telugu Contemporary Version

8 అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు. 9 అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, "నీవెక్కడున్నావు?" అని అడిగారు.

10 అతడు, "తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను" అని జవాబిచ్చాడు.

11 అప్పుడు దేవుడు, "నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?" అని అడిగారు.

12 అందుకు ఆదాము, "మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను" అని చెప్పాడు.

13 అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, "నీవు చేసిన ఈ పనేంటి?" అని అడిగారు.

అందుకు ఆ స్త్రీ జవాబిస్తూ, "సర్పం మాటలకు మోసపోయి నేను తిన్నాను" అని చెప్పింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.

    9 దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ "నువ్వెక్కడ ఉన్నావు?" అన్నాడు. 10 అతడు "నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను" అన్నాడు. 11 దేవుడు "నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?" అన్నాడు.

    12 ఆదాము "నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను" అన్నాడు. 13 దేవుడైన యెహోవా స్త్రీతో "నువ్వు చేసిందేమిటి?" అన్నాడు. స్త్రీ "సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను" అంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.