Pular para o conteúdo
Publicidade

హెబ్రీ పత్రిక 1

దేవుని తుది వాక్కు: ఆయన కుమారుడు

1 గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు. 2 కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు. 3 ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తర్వాత, ఆయన పరలోకంలో మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు. 4 కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు.

కుమారుడు దేవదూతల కంటే ఉన్నతుడు

5 దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు,

"నీవు నా కుమారుడవు;

ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను"1:5 కీర్తన 2:7

అని గాని,

"నేను అతనికి తండ్రిగా ఉంటాను,

అతడు నాకు కుమారునిగా ఉంటాడు,"1:5 2 సమూ 7:14; 1 దిన 17:13 అని గాని అన్నారా?

6 దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన,

"దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,"1:6 ద్వితీ 32:43 అని చెప్పారు.

7 దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు,

"ఆయన తన దూతలను ఆత్మలుగా,

తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,"1:7 కీర్తన 104:4

అని అన్నారు.

8 కాని తన కుమారుని గురించి ఆయన,

"ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది;

మీ న్యాయ దండం మీ రాజ్య రాజదండం.

9 మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషించారు;

కాబట్టి దేవుడు, మీ దేవుడు, ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి,

మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు,"1:9 కీర్తన 45:6,7 అని అన్నారు.

10 ఇంకా ఆయన,

"ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు,

ఆకాశాలు మీ చేతి పని.

11 అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు;

ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.

12 వాటిని మీరు అంగీలా చుట్టి పెడతారు;

వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి.

కానీ మీరు అలాగే ఉంటారు,

మీ సంవత్సరాలకు అంతం ఉండదు,"1:12 కీర్తన 102:25-27 అని అన్నారు.

13 దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా,

"నేను నీ శత్రువులను

నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు

నా కుడి వైపున కూర్చో అని చెప్పారా"1:13 కీర్తన 110:1?

14 దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.