3 అయితే ఆ బలులు ప్రతి సంవత్సరం పాపాల గురించి వారికి గుర్తు చేసేవిగా ఉండేవి. 4 ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము.
5 అందుకని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు ఇలా అన్నారు:
"బలిని అర్పణను మీరు కోరలేదు,
కాని మీరు నాకొక శరీరాన్ని సిద్ధపరచారు;
6 దహనబలులతో పాపపరిహార బలులతో
మీరు సంతోషించలేదు.
7 అప్పుడు నేను ఇలా అన్నాను, ‘ఇదిగో నేను ఉన్నాను;
గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాయబడినట్లు
నా దేవా, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను.’ "10:7 కీర్తన 40:6-8
8 ఆయన మొదట ఇలా అన్నారు, "బలులు, అర్పణలు, దహనబలులు, పాపపరిహార బలులను కోరలేదు, అవి ధర్మశాస్త్ర ప్రకారమే అర్పించబడినప్పటికి వాటిని బట్టి మీరు సంతోషించలేదు." 9 తర్వాత ఆయన, "నేను ఇక్కడే ఉన్నాను, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను" అని చెప్పాడు. ఆయన రెండవదానిని స్థాపించడానికి మొదటి దానిని ప్రక్కన పెడతాడు. 10 ఆ చిత్తాన్ని బట్టి, యేసు క్రీస్తు శరీరాన్ని అందరి కోసం ఒక్కసారే అర్పించుట ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము.