Pular para o conteúdo
Publicidade

యోబు 25

బిల్దదు

1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:

2 "అధికారం భీకరత్వం దేవునివే;

ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు.

3 ఆయన సైన్యాలు లెక్కించబడగలవా?

ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు?

4 అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు?

అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?

5 ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు;

నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.

6 పురుగువంటి మనుష్యుడు

క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!"

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.