Pular para o conteúdo
Publicidade

యోనా 2:3-6,9,10

OTSA Telugu Contemporary Version

3 మీరు నన్ను అగాధంలో

సముద్ర గర్భంలో పడవేశారు.

ప్రవాహాలు నన్ను ఆవరించాయి,

మీ అలలు, తరంగాలు

నన్ను ముంచి వేశాయి.

4 ‘నేను మీ సన్నిధి నుండి

నన్ను తరిమివేసినా

మరలా నేను పరిశుద్ధ ఆలయం వైపు

తిరిగి చూస్తాను’ అనుకున్నాను.

5 ముంచివేసే నీళ్లు నన్ను భయపెట్టాయి,2:5 లేదా నీళ్లు నా గొంతు వరకు ఉన్నాయి

అగాధం నన్ను ఆవరించింది;

సముద్రంలో ఉన్న నాచు నా తలకు చుట్టుకుంది.

6 పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను,

క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి.

అయితే నా దేవా! యెహోవా,

మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు.

9 నేనైతే కృతజ్ఞత స్తుతులు చేస్తూ

మీకు బలి అర్పిస్తాను.

నేను చేసిన మ్రొక్కుబడి చెల్లిస్తాను,

‘రక్షణ యెహోవా నుండి వస్తుంది’ అని అంటాను."

10 యెహోవా ఆ చేపకు ఆజ్ఞాపించగా అది యోనాను పొడినేల మీద కక్కివేసింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 నువ్వు నన్ను అగాధంలో, సముద్రగర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి.

    నీ అలలూ తరంగాలూ నా మీదుగా వెళ్తున్నాయి.

    4 నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా,

    నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను.

    5 నీళ్ళు నన్ను చుట్టుకోవడంతో నేను కొనప్రాణంతో ఉన్నాను.

    సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది.

    6 నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి.

    పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను.

    నా దేవా, యెహోవా, నువ్వు నా జీవాన్ని అగాధంలో నుంచి పైకి రప్పించావు.

    9 నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి సమర్పిస్తాను.

    నేను మొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను.

    యెహోవా దగ్గరే రక్షణ దొరుకుతుంది."

    10 అప్పుడు యెహోవా చేపకు ఆజ్ఞాపించగానే అది యోనాను పొడి నేల మీద కక్కి వేసింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Jonas
Ver todos os capítulos de Jonas