Pular para o conteúdo
Publicidade

యోనా 4:1-4,10,11

OTSA Telugu Contemporary Version

దేవుడు నీనెవెపై దయ చూపడంపై యోనాకు కోపం

1 అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది. 2 అతడు యెహోవాకు ప్రార్థన చేస్తూ అన్నాడు, "యెహోవా, ఇలా జరుగుతుందని నేను నా దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా? అందుకే నేను తర్షీషుకు పారిపోవడానికి ప్రయత్నించాను. మీరు కృపాకనికరంగల దేవుడని, త్వరగా కోప్పడరని, మారని ప్రేమ గలవారని, కీడు కలిగించకుండా మానివేస్తారని నాకు తెలుసు. 3 యెహోవా, బ్రతకడం కంటే నాకు చావడం మేలు, కాబట్టి నా ప్రాణాన్ని తీసివేయండి."

4 అయితే యెహోవా జవాబిస్తూ, "నీవలా కోప్పడడం న్యాయమేనా?" అని అన్నారు.

10 అయితే యెహోవా, "నీవు ఈ చెట్టును పోషించలేదు, పెంచలేదు. అది రాత్రికి రాత్రి మొలిచింది, రాత్రికి రాత్రి చచ్చింది. అయినా నీవు ఈ చెట్టు విషయంలో బాధపడుతున్నావు. 11 అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?" అన్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు. 2 కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. "నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు. 3 కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు."

    4 అందుకు యెహోవా "నువ్వు అంతగా కోపించడం న్యాయమా?" అని అడిగాడు.

    10 అందుకు యెహోవా "నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది. 11 అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?" అని అతనితో అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Jonas
Ver todos os capítulos de Jonas