21 మార్త యేసుతో, "ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. 22 ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు" అన్నది.
23 యేసు ఆమెతో, "నీ సహోదరుడు మరల లేస్తాడు" అని చెప్పారు.
24 అందుకు మార్త, "చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు" అన్నది.
25 యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. 26 బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?" అని ఆమెను అడిగారు.
43 యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, "లాజరూ, బయటకు రా!" అని పిలిచారు. 44 చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది.
అప్పుడు యేసు వారితో, "సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి" అన్నారు.