Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 19:23-27

OTSA Telugu Contemporary Version

23 సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత, వారు ఆయన వస్త్రాలను తీసుకుని, ఒక్కొక్కరికి ఒక భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు కాని ఆయనపై అంగీ ఏ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు ఒకే వస్త్రంగా నేయబడింది.

24 కాబట్టి వారు, "దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకుందాం" అని చెప్పుకొన్నారు.

లేఖనంలో వ్రాయబడినట్లు,

"వారు నా వస్త్రాలు పంచుకుని

నా అంగీ కోసం చీట్లు వేస్తారు"19:24 కీర్తన 22:18

అనేది నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.

25 యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. 26 యేసు అతని తల్లి తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉండడం చూసి, ఆయన తన తల్లితో, "అమ్మా, ఇదిగో నీ కుమారుడు" అని, 27 తర్వాత తన ఆ శిష్యునితో, "ఇదిగో నీ తల్లి" అని చెప్పారు. అప్పటినుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసుకుని నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకున్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి, 24 వారు ఒకరితో ఒకరు, "దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం" అన్నారు.

    "నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు,

    నా దుస్తుల కోసం చీట్లు వేశారు,"

    అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు. 25 యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. 26 ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, "అమ్మా, ఇదిగో నీ కొడుకు" అన్నాడు. 27 తరువాత ఆ శిష్యునితో, "ఇదిగో నీ తల్లి" అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.