19 యేసు, "ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో దానిని తిరిగి లేపుతాను" అని వారికి జవాబిచ్చారు.
20 దానికి వారు, "ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?" అని అడిగారు. 21 అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు.