యేసు మృతులలో నుండి లేచుట
1 వారం మొదటి రోజున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వెళ్లి సమాధి ద్వారాన్ని మూసిన రాయి తొలగిపోయి ఉండడం చూసింది.
6 ఆ తర్వాత అతని వెనకాలే వచ్చిన సీమోను పేతురు నేరుగా సమాధిలోనికి వెళ్లి, అక్కడ నారబట్టలు పడి ఉన్నాయని, 7 యేసు తలకు చుట్టిన రుమాలు, ఆ నారబట్టలతో కాకుండా వేరే చోట మడతపెట్టి ఉందని చూశాడు.
మగ్దలేనేకు చెందిన మరియకు యేసు కనిపించుట
11 కాని మరియ, సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ సమాధిలోనికి తొంగి చూసినప్పుడు,
14 అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది, కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తు పట్టలేదు.
15 ఆయన, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెదకుతున్నావు?" అని అడిగారు.
ఆమె ఆయనను తోటమాలి అనుకుని, "అయ్యా, నీవు ఆయనను తీసుకెళ్తే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు. నేను ఆయనను తీసుకెళ్తాను" అన్నది.
16 యేసు ఆమెను, "మరియ" అని పిలిచారు.
ఆమె ఆయన వైపుకు తిరిగి "రబ్బూనీ" అని పిలిచింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో "బోధకుడు" అని అర్థము.
18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్లి, "నేను ప్రభువును చూశాను! ఆయన నాతో ఈ సంగతులు చెప్పారు" అని వారికి చెప్పింది.