Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 20:17,18

OTSA Telugu Contemporary Version

17 యేసు, "నేను తండ్రి దగ్గరకు ఇంకా ఆరోహణమవ్వలేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. నీవు నా సహోదరుల దగ్గరకు వెళ్లి వారితో, ‘నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడునైన వాని దగ్గరకు ఎక్కి వెళ్తున్నాను’ అని వారితో చెప్పు" అన్నారు.

18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్లి, "నేను ప్రభువును చూశాను! ఆయన నాతో ఈ సంగతులు చెప్పారు" అని వారికి చెప్పింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    17 యేసు ఆమెతో, "నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు" అన్నాడు. 18 మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, "నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు" అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.