7,8 ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో, "నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?" అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు.
9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, "నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వమని ఎలా అడుగుతావు?" అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు.
10 యేసు, "నీవు దేవుని బహుమానం గురించి, నిన్ను నీళ్లు అడుగుతున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే నీవే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు" అని ఆమెకు జవాబిచ్చారు.
16 ఆయన ఆమెతో, "వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా" అని చెప్పారు.
17 అందుకు ఆమె, "నాకు భర్త లేడు" అన్నది.
యేసు ఆమెతో, "నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. 18 నిజానికి, నీకు అయిదుగురు భర్తలు ఉండేవారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు" అన్నారు.
26 అప్పుడు యేసు, "నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను" అని చెప్పారు.
29 "రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?" అని చెప్పింది.