7,8 ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో, "నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?" అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు.
9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, "నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వమని ఎలా అడుగుతావు?" అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు.
26 అప్పుడు యేసు, "నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను" అని చెప్పారు.
యేసు దగ్గరకు తిరిగివచ్చిన శిష్యులు
27 ఇంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చి యేసు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, "నీకు ఏమి కావాలి? అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?" అని గాని ఎవరు అడగలేదు.
విశ్వసించిన అనేకమంది సమరయులు
39 ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, "నేను చేసిందంతా నాతో చెప్పారు" అని ఆ స్త్రీ ఆయనను గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు.