Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 6:35,48,51,53,56,60,66

35 అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: "జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.

48 జీవాహారం నేనే. 51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే" అని చెప్పారు.

53 అందుకు యేసు వారితో, "నేను మీతో చెప్పేది నిజం, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు. 56 నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను.

యేసును విడిచిపెట్టిన అనేకమంది శిష్యులు

60 అది విన్న ఆయన శిష్యులలో అనేకమంది, "ఇది కష్టమైన బోధ, ఎవరు దీనిని అంగీకరిస్తారు?" అన్నారు.

66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనక్కి వెళ్లిపోయి మరి ఎన్నడు ఆయనను వెంబడించలేదు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.