Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 7:14-18

OTSA Telugu Contemporary Version

పండుగ సమయంలో యేసు బోధించుట

14 పండుగ ఉత్సవాలు సగం రోజులు పూర్తియైన తర్వాత యేసు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. 15 అక్కడ ఉన్న యూదులు ఆశ్చర్యపడి, "చదువుకోని వానికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది?" అని అడిగారు.

16 అందుకు యేసు, "నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది. 17 దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నవారు నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేదా నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు. 18 సొంతగా మాట్లాడేవారు తన ఘనత కొరకే అలా చేస్తారు, కాని తనను పంపినవాని ఘనత కోసం చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి ఆయనలో చోటు ఉండదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    14 పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు. 15 ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి, "చదువూ సంధ్యా లేని వాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది" అని చెప్పుకున్నారు.

    16 దానికి యేసు, "నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే. 17 దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు. 18 తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.