Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 18:1-6

OTSA Telugu Contemporary Version

కుమ్మరి ఇల్లు

1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు: 2 "నీవు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను" అని ఆదేశించింది. 3 కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అక్కడ కుమ్మరి చక్రంపై పని చేయడం చూశాను. 4 అయితే బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది; అతడు దాన్ని మళ్ళీ ముద్ద చేసి తనకు ఇష్టమైన ఆకారంలో మరో కుండను చేశాడు.

5 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది. 6 ఆయన, "ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?" అని యెహోవా ప్రకటిస్తున్నారు. "కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.

    2 "నువ్వు లేచి కుమ్మరి యింటికి వెళ్ళు. అక్కడ నా మాటలు నీకు చెబుతాను."

    3 నేను కుమ్మరి ఇంటికి వెళితే అతడు తన సారె మీద పని చేస్తున్నాడు.

    4 అయితే కుమ్మరి బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది. అందుచేత అతడు తన మనస్సు మార్చుకుని తనకిష్టమైనట్టు మరో కుండ చేశాడు.

    5 అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు,

    6 "ఇశ్రాయేలు ప్రజలారా! ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా?" ఇది యెహోవా వాక్కు. "బంక మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.