Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 29:4-7,10,11

OTSA Telugu Contemporary Version

4 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు: 5 "ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి. 6 పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది. 7 అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు."

10 యెహోవా ఇలా అంటున్నారు: "బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను. 11 ఎందుకంటే మీ కోసం నేను ఏర్పరచుకున్న ప్రణాళికలు నాకు తెలుసు" అని యెహోవా అంటున్నారు. "అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ఉద్దేశాలే గాని మీకు హాని కలిగించడానికి కాదు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 అందులో ఇలా ఉంది "ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు, 5 ‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.

    6 పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి. 7 నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.’

    10 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.