Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 7:30-33

OTSA Telugu Contemporary Version

సంహార లోయ

30 " ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు. 31 వారు వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతులో క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు నా మనస్సులోకి కూడా రాలేదు. 32 కాబట్టి జాగ్రత్త, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ప్రజలు ఇకపై తోఫెతు అని గాని బెన్ హిన్నోము లోయ అని గాని పిలువక, సంహార లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, ఎందుకంటే వారు తోఫెతులో స్థలం లేకుండ పోయే వరకు చనిపోయినవారిని పాతిపెడతారు. 33 అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    30 యెహోవా చెప్పేదేమంటే, యూదా ప్రజలు నా దృష్టికి దుష్టత్వం జరిగిస్తున్నారు,

    నా పేరు పెట్టిన మందిరం అపవిత్రమయ్యేలా వారు దానిలో అసహ్యమైన వస్తువులు ఉంచారు.

    31 నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు. 32 యెహోవా చెప్పేదేమంటే, ఒక రోజు రాబోతున్నది. అప్పుడు దాన్ని తోఫెతు అని గానీ, బెన్‌ హిన్నోము లోయ అని గానీ పిలవరు, దాన్ని ‘వధ లోయ’ అని పిలుస్తారు. ఎందుకంటే, పాతిపెట్టడానికి స్థలం లేకపోయేటంత వరకూ తోఫెతులో శవాలు పాతిపెడతారు.

    33 అప్పుడు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులకూ భూజంతువులకూ ఆహారంగా మారతాయి. వాటిని తోలివేయడానికి ఎవరూ ఉండరు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.