Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 15:18,19

OTSA Telugu Contemporary Version

18 అతనికి బాగా దాహం వేయడంతో యెహోవాకు మొరపెట్టి, "మీ సేవకుడనైన నాకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతిలేనివారి చేతుల్లో పడాలా?" అన్నాడు. 19 అప్పుడు దేవుడు లేహిలో ఉన్న ఒక బోలు స్థలం తెరవగా దానిలో నుండి నీళ్లు వచ్చాయి. సంసోను నీరు త్రాగగానే అతనికి బలం తిరిగివచ్చి అతని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆ ఊట ఎన్-హక్కోరె15:19 ఎన్-హక్కోరె అంటే పిలిచేవారి బుగ్గ అని పిలువబడింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    18 అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసి యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. "నీ సేవకునికి గొప్ప విజయం అనుగ్రహించావు. ఇప్పుడు నేను దాహంతో మరణిస్తే ఈ సున్నతి సంస్కారం లేని మనుషుల చేతిలో పడతాను" అంటూ వేడుకున్నాడు.

    19 అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి "ఏన్ హక్కోరే15:19 ఏన్ హక్కోరే మొరపెట్టేవాడి ఊట " అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.