4 సంసోను బయటకు వెళ్లి మూడువందల నక్కలను పట్టుకుని, రెండేసి నక్కల తోకలను ఒకదానికొకటి ముడివేసి ఆ రెండు తోకల మధ్య ఒక దివిటీని కట్టి, 5 ఆ దివిటీలను వెలిగించి ఫిలిష్తీయుల గోధుమ పంట చేలల్లోకి ఆ నక్కలను వదిలాడు. ఇలా అతడు పనల కుప్పలను పైరును ద్రాక్ష ఒలీవ తోటలను తగలబెట్టాడు.
6 ఫిలిష్తీయులు, "ఇలా ఎవరు చేశారు?" అని అడిగినప్పుడు, "తిమ్నా అల్లుడైన సంసోను; తన భార్యను తన స్నేహితునికి ఇచ్చినందుకు అలా చేశాడు" అని చెప్పారు.
అందుకు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రిని కాల్చి చంపారు.
14 అతడు లేహిని సమీపించినప్పుడు, ఫిలిష్తీయులు కేకలువేస్తూ అతని దగ్గరకు వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి రాగా అతని చేతులకున్న త్రాళ్లు కాలిపోయిన నారపీచులై అతని చేతుల నుండి తెగిపడిపోయాయి. 15 అక్కడే అతనికి గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దాన్ని చేతపట్టుకుని దానితో వేయిమందిని చంపేశాడు.
20 ఫిలిష్తీయుల రోజుల్లో సంసోను ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.