Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 16:18-22

OTSA Telugu Contemporary Version

18 అతడు తనకు మొత్తం చెప్పాడని దెలీలా గ్రహించి, ఫిలిష్తీ నాయకులకు, "మరోసారి మీరు రండి; అతడు నాకు మొత్తం చెప్పాడు" అని కబురు పంపింది. కాబట్టి ఫిలిష్తీయుల నాయకులు తమతో వెండిని తీసుకువచ్చారు. 19 ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒకని పిలిపించి, సంసోను ఏడు జడలను క్షౌరం చేయించి అతన్ని ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అతని బలం అతన్ని విడిచిపోయింది.

20 అప్పుడు ఆమె, "సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!" అని అన్నది.

అతడు నిద్ర మేల్కొని, "నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను" అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.

21 తర్వాత ఫిలిష్తీయులు అతన్ని బంధించి కళ్లు ఊడదీసి గాజాకు తీసుకెళ్లారు. అతన్ని ఇత్తడి గొలుసులతో బంధించి చెరసాలలో ధాన్యం విసరడానికి పెట్టారు. 22 అయితే క్షౌరం చేయబడిన అతని తలమీద వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    18 అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. "మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు" అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు.

    19 ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది. 20 ఆమె "సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!" అంది. సంసోను నిద్ర లేచి "ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను" అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.

    21 అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి బంధించి అతని కళ్ళు ఊడబెరికారు. గాజాకు అతణ్ణి తీసుకు వచ్చి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు. 22 అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.