యెహోవా మాట్లాడడం
1 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:
2 "తెలివిలేని మాటలతో
నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు?
3 పురుషునిగా నీ నడుము కట్టుకో;
నేను నిన్ను ప్రశ్నిస్తాను,
నీవు నాకు జవాబు చెప్పాలి.
4 "నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు?
నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.