Pular para o conteúdo
Publicidade

యోబు 38:4-11

4 "నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు?

నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.

5 దాని కొలమానాన్ని ఎవరు నిర్ణయించారు? నీకు ఖచ్చితంగా తెలుసు!

దాని చుట్టూ కొలత రేఖను వేసిందెవరు?

6,7 వేకువ చుక్కలన్ని కలిసి గానం చేస్తుంటే

దేవదూతలంతా ఆనంద కేకలు వేస్తుంటే

దాని పాదాలు దేనిపై మోపబడ్డాయి?

దానికి మూలరాయి వేసింది ఎవరు?

8 "భూగర్భం నుండి సముద్రం పొంగి వచ్చినప్పుడు

తలుపుల వెనుక దానిని మూసి ఉంచింది ఎవరు?

9 నేను మేఘాలను దానికి వస్త్రంగా చేసి

కటిక చీకటిలో దానిని చుట్టిపెట్టినప్పుడు,

10 నేను దానికి హద్దులను నిర్ణయించి

తలుపులు గడియలు అమర్చినప్పుడు,

11 ఇక్కడి వరకు నీవు రావచ్చు ఇంతకు మించి కాదు;

నీ అహంకార అలలు ఇక్కడే ఆగిపోవాలి,

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.