5 గతంలో నా చెవులు మీ గురించి విన్నాయి
కాని ఇప్పుడైతే నా కళ్లు మిమ్మల్ని చూశాయి.
6 కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని
దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను."
ముగింపు
7 యెహోవా యోబుతో ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో, "నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. కాబట్టి నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను.