Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 1:26-28,36,38,39,56

యేసు పుట్టుక గురించి ముందుగానే చెప్పబడుట

26 ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, 27 దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. 28 ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, "బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు" అని చెప్పాడు.

36 నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది.

38 అందుకు మరియ, "నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక" అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.

మరియ ఎలీసబెతును దర్శిస్తుంది

39 కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది,

56 మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.