Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 1:26-28,38,46-48

యేసు పుట్టుక గురించి ముందుగానే చెప్పబడుట

26 ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, 27 దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. 28 ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, "బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు" అని చెప్పాడు.

38 అందుకు మరియ, "నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక" అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.

మరియ గీతం

46 అందుకు మరియ:

"నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.

47 నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.

48 తన సేవకురాలి దీనస్థితిని

ఆయన గమనించారు.

ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.