30 అయితే ఆ దూత ఆమెతో, "మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. 31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. 33 ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు" అని చెప్పాడు.
Publicidade
లూకా సువార్త 1:30-33
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
30 దూత, "మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది. 31 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. 32 ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. 33 ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు" అని ఆమెతో చెప్పాడు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.