Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 1:34-38

OTSA Telugu Contemporary Version

34 మరియ ఆ దూతతో, "నేను కన్యను కదా, అదెలా సాధ్యం?" అని అడిగింది.

35 అందుకు ఆ దూత, "పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.1:35 లేదా పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని పిలువబడతాడు 36 నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది. 37 ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు" అన్నాడు.

38 అందుకు మరియ, "నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక" అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    34 మరియ, "నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?" అంది. 35 ఆ దూత, "పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. 36 పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల. 37 దేవునికి అసాధ్యం ఏమీ లేదు" అని ఆమెతో చెప్పాడు.

    38 అందుకు మరియ, "నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక" అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.