Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 1:59-64

OTSA Telugu Contemporary Version

59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, 60 తల్లి, "వద్దు! బాబును యోహాను అని పిలువాలి" అని చెప్పింది.

61 అందుకు వారు ఆమెతో, "మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా" అన్నారు.

62 వారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు. 63 అందుకతడు ఒక పలకను అడిగి, "బాబు పేరు యోహాను" అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు. 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    59 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయబోతుండగా 60 తల్లి, "అలా కాదు. ఆ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి" అంది. 61 అందుకు వారు, "నీ బంధువుల్లో ఆ పేరుగల వారెవరూ లేరు గదా" అని, 62 "వాడికి ఏ పేరు పెట్టాలి?" అని తండ్రిని సైగలతో అడిగారు. 63 అతడు పలక తెమ్మని, "బాబు పేరు యోహాను" అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు. 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.